1st year ఐయిoది,2nd year ఒక కొత్త ఉత్సాహం తో స్టార్ట్ చేసాను.కాలేజీ 1st day అన్ని మర్చిపోయి కాలేజీ లోకి అడిగుపెట్టాను.ఆ రోజు ఏం క్లాసులు జరగకపోవడంతో కాలేజీ నుంచి త్వరగా బయటకు వచ్చాము.కాలేజీ బయట ఒక హోటల్ ఉంది.నేను ఇంకా ఫ్రెండ్స్ ఉంటె అందరo హోటల్లో కి వెళ్ళాము,ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు.నేను మాత్రం ఇనుప స్తంబం ఉంటె దానికి ఆనుకొని నిల్చున్నాను.కొంచం సెపు మాట్లాడుకున్న తరువాత బస్సు వస్తుందని బయటకు వచ్చాము.బయటకు రాగానే హోటల్ మీద కరెంటు తీగ తెగిపడింది.పెద్దగా నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి.ఆ హోటల్ ఇనుప రేకులతో వేసి ఉంది.మేం ఇంకో 10 సెకనులు అక్కడే ఉంటె నా పని ఐపోయేది. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఎవరి ఇంటికి వాళ్ళు వేల్లిపోయాం.
మనసుకు, మెదడుకి చాలా పెద్ద తేడా ఉంది.మనసు నమ్మడానికి కారణాలు వెతకదు,కానీ మెదడు ఎప్పుడు ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటుంది.మెదడు మనసు చెప్తే వింటుంది,కానీ మనసు తన మాటే తను వింటుంది.నేను తనని ఇష్టపడటానికి ఎప్పుడు కారణం వెతక లేదు.కానీ తనని మర్చిపోవడానికి కారణాలు వెతికాను.ఇష్టపడటం అనేది మనసుకు సంబందించినది,నమ్మకం మెదడుకు సంబందిoచినది.ఒక్కసారి నిజంగా ఇష్టపడితే చనిపోయే చివరి క్షణం వరకు,చివరి క్షణం వరకేంటి చనిపోయిన తరువాత,ఇంకా చెప్పాలి అంటే జన్మజన్మల వరకు మర్చిపోవడం కుదరదు.అదే నా జీవితం లో నిజం ఐయిoది.వారం తురువాత కాలేజీ కి వెళ్ళాను.కాలేజీ లో తనని చూసాను,తనని చూడగానే అన్ని మర్చిపోయాను,మళ్ళి తనను ఇష్టపడం మొదలు పెట్టాను.
రెండు రోజుల వరకు తనని చూస్తూనే ఉన్నాను.కానీ ఒక్క క్షణం ఆలోచించాను,నేను చెసేది తప్పా,ఒప్పా అని.వేరే ఒకరిని ఇష్టపడే వారిని నేను ఇష్టపడటం తప్పు అనిపించింది.మర్చిపోవాలి,మర్చిపోవాలి,మర్చిపోవాలి ఇలా కొన్ని వేలసార్లు అనుకోని ఉంటా.ఏం చేసిన తనే గుర్తుకు వస్తుంది.ఏం చెయ్యాలి,ఏం చెయ్యాలి ఇలా అనుకుంటున్నా సమయంలో క్లాస్ లో ఒకతను మంచి ఫ్రెండ్ అయ్యాడు.వాడితో ఉన్నoత సేపూ అన్ని మర్చిపోయే వాడిని.ఎప్పుడు నావ్విస్తూ ఉండేవాడు.(ఇంకా ఉంది)......