రామ్ నాతో ఆ మాట చెప్పగానే నేను పెద్దగా నవ్వాను.అది ఏంటి అంటే ఆ అమ్మాయి మా సీనియర్.రామ్ కుడా నవ్వాడు.నేను మళ్ళి తన ధ్యాసలో పడిపోయాను.తను మాట్లడుతూ ఉంటె పియానో మీద మంచి మెలోడీ సాంగ్ ప్లే చేసినట్టు ఉంది.అలా తను మాట్లాడుతున్నంత సెపు తని చూస్తూ ఉండిపోయాను,అప్పుడు చుట్టూ ఉన్న నా ప్రపంచం నరకం లా ఉంటె,తను మాత్రం ఆ నరకం మధ్యలో జన్నత్(Jannat) లాగా కనిపించింది.అప్పుడు ఆక్షణం తనని చూస్తూ ఉంటె నాకు తెలియకుండానే పెదవులపై చిరు నవ్వు వచ్చింది,గుండెలో హాయిగా అనిపించింది.ఆప్పుడు నా మనసు చెప్పింది ఏది ఏమైనా సరే తనని దురం చేసుకోకు అని.అప్పుడే నా మనసులో ఒక కవిత్వం ఉపోగింది.
"తను నా చేతి లో చై వేసి నడవనక్కరలేదు
నా కళ్ళతో ఊసులాడనవసరం లేదు
తన మాటల చినుకుతో నా తనవు తడవనవసరం లేదు
చిన్ని చిరునవ్వుతో నా యధపై ఒక్క క్షణం పవళిస్తే చాలు
ఆ క్షణాన నా ఊపిరి ఆగిపోయినా పర్వాలేదు!!!"
తను మాట్లడటం ఐపోయింది,తను వెళ్ళిపోతుంది,అక్కడ నుంచి బయటకు వెళ్లిపోయింది.అపుడు తేరుకున్నాను వెంటనే నేను కుడా బయటికి వచ్చాను.తను బయట తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది.చాలా సెపు తననే చూస్తూ,తను ఎటు వెళితే అటు తన వెంట తిరిగాను.ఆ తరువత రామ్ వచ్చి నన్ను లాక్కొని పోయాడు.ఏంచేస్తున్నావురా అని అడిగాడు తను నాకు బాగా నచ్చిందిరా అన్నాను,తను మన సీనియర్ రా అన్నాడు నవ్వుతు,అయినా ఏం కాదు ,తను నా కంటే పెద్దదైన సరే "I LOVE HER" అని మనసులో అనుకున్నాను'.తన పేరు తెలియదు,తన బ్రాంచ్ తెలియదు కానీ తను నచ్చిoది అన్న ఒక్క విషయం రామ్ కి బాగా నచ్చిందిరామ్ నా ఫోన్ నెంబర్ తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోయాడు.నేను మాత్రం అక్కడే చాల సెపు తను కనిపిస్తుందని తిరిగాను,తను కనిపించింది,మళ్ళి ఆనందం ఇంతలో నాన్న కాల్ చేసి తొందరగా ఇంటికి వెళ్ళు అన్నారు,చేసేది లేక నేను కుడా వీల్లిపోయాను,కానీ న మనసు మాత్రం తన చుట్టు తిరుగుతునే ఉంది.... (ఇంకా ఉంది).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి