Telugu Prema Kathalu

పేజీలు

25, మార్చి 2019, సోమవారం

Starting soon......


ప్రాణం పొసే ప్రేమవా !, ప్రాణం లేని బొమ్మనుచేసే అమ్మైవా !!
గుండెకు గొంతుకనిచే పల్లవివా !, పాట గౌంతు నులిమే కసాయివా !!
వేకువ కలవా !, పగటి సత్యనివా !!
గమ్యం లేని జీవితానికి దిక్షుచివా !, దయలేని దేవతవా !!!

12, అక్టోబర్ 2015, సోమవారం

Wings

గమనిక: కధ,కధలోని పాత్రలు కల్పితం.          
    ఒకానొక మాయ ప్రపంచయం లో ఒక అమాయక పక్షి నివసిస్తూ ఉండేది. ఆ పక్షికి ఒకరోజు విశాలమైన ఆకాశంలో విహరిస్తూ ఉండగా ఒక అందమైన పువ్వును చూసి ఆశ్చర్యపోయి,ఆ ఆశ్చర్యంలో మొక్కపై ఉన్న ముళ్ళను గమనించకుండా  ఆ పువ్వుఉన్న మొక్కపై వాలింది, ఆ ముళ్ళు  వాడిగా ఉండటం వల్ల ,ఆ ముళ్ళు పక్షి ఒక  రెక్కలోకి దిగిపోయాయి,ఆ ముళ్ళు పక్షి  రెక్కని చిల్చినంత పని చేసాయి.పక్షి రెక్క నుండి ధారల రక్తం  కారసాగింది, ఆ రక్తం వల్ల పువ్వు సౌందర్యం పాడు అవతుంది అని, గాయం ఐన రెక్కను చూసుకుంటూ వేరే రెక్కతో అక్కడి నుండి ఎగిరిపోయింది.

    కొన్ని రోజులకు గాయం మానిపోయింది కానీ గాయం ఐన రెక్క మాత్రం నిర్జివం లేకుండా పోయింది,జీవం ఉన్న ఒక రేక్కతోనే విహరిస్తూ ఉండేది, కొంతకాలానికి ఒక అందమైన పక్షి మొదటి పక్షితో చెలిమి కోరింది,మొదటి పక్షి బయపడుతునే చెలిమి చేసింది,కొంత కాలానికి మొదటి పక్షి ప్రేమలో పడింది కానీ తమ చెలిమి ముక్కలవుతుంది అని ఆ విషయం రెండో పక్షికి ఎపుడు చెప్పలేదు, కొంత కాలానికి రెండో పక్షి తనతో మెలిగే విధానం చూసి ఆ పక్షికి  తను అంటే ఇష్టం అనుకోని పోరపడి,ఎంతో సంతోషంగా ఉండసాగింది.

    అన్ని మనస్సులు ఒకేలే ఉండవు అనే సత్యాన్ని మొదటి పక్షి అర్ధం చేసుకోలేక,రెండో పక్షిని ప్రేమిస్తున్న విషయం చెప్పింది,కానీ  ఆ మాట విన్న రెండో  పక్షి ఆశ్చర్యపోయి, తను ఎపుడు స్నేహంగానే మేలిగాను,తన లో ఎపుడు అలాంటి బావం ఏనాడూ కలగలేదు అని చెప్పింది. ఆ మాట విన్న మొదటిపక్షి కనీరు కార్చింది, కానీ ఎందుకో వెంటనే ఆపెసింది.ఆకాశం లో బాధతో విహరిస్తున్న పక్షి ఒక్కసారిగా కిందకు పడసాగింది,అల కింద పడుతుండగా తన జీవితం తన కళ్ళముందు కదిలింది, తను ఆకరిగా బాధ పడిన సంఘటన తన మదిలో మెదులుతూ ఉండగా ఆ పక్షి నేలకు బలగా తాకింది,ఆపక్షి నెమ్మదిగా కళ్ళు మూసింది.కొంత సేపటికి   కళ్ళుతెరిచి  మైకం నుండి తెరుకోని గాలిలోకి ఎగరడానికి ప్రయత్నిచింది,ఏంటో తెలియదు తన శరీరంలో ఏదో తెలియని వెలితి,ఏదో పొగొట్టుకున్న అనుబవం. ఆ పక్షి తన రెండు రెక్కల వైపు  చూసుకుంది,ఒక రెక్క మాత్రమే కనిపించింది,అదికూడా అంతక ముందు గాయం ఐన రెక్క,రెండో వైపు రెక్క కనిపించడం లేదు,దిక్కు తోచక చుట్టుపక్కల చూసింది దూరంగా తన రెక్క రక్తమోడుతూ విలవిలలాడుతూ కనిపించింది,పక్కనే రక్తంతో తడిసి ముద్దైన రాయి కనిపించింది.అపుడు అర్ధమైంది ఆ పక్షికి ఆ రాయి ప్రేమ అనే మరొక అమాయక జీవి విసరడం తో తగిలింది అని.ఏమి చెయ్యలేని పరిస్థితిలో ఆ పక్షి ప్రాణంలేని జీవిలా మళ్ళి మైకం జారకుంది.

    మైకం లోకి జారుకున్న ఆ పక్షికి ఒక అందమైన కల వచ్చింది.ఆ కలలో  " చల్లటి గాలి కి  హయీగా నిద్రపోతున్న పోతున్న గాయపడిన పక్షి కి ఒక మెరుపుతో మెలుకువ వచ్చింది,నెమ్మదిగా కళ్ళు తెరుస్తుండగా ఒక వెలుగు నుండి ఎవరో ఎగురుతూ తన వైపు వస్తునట్టు అనిపించి అతి కష్టం మిద లేచి నిల్చుంది  అల ఎగురుతూ వచ్చింది ఎవరోకాదు తను ప్రేమించిన  పక్షి,అల ఆ పక్షి ఎగురుతూ వచ్చి గయాపడిన పక్షిముందు వాలింది,గాయపడిన పక్షి తన రెక్కలు లేవు అన్న విషయం మర్చిపోయి తన  రెక్కలతో ప్రేమించిన పక్షిని తాకాలి అని ప్రయత్నిచింది కానీ తన వల్ల కాలేదు.రెండో పక్షి నవ్వుతూ తన రెక్కలతో గాయపడిన రెక్కను పట్టుకొని ఆకాశంలోకి ఎగిరింది అల ఎగుతూ గాయపడిన పక్షిని చూసింది,గాయపడిన పక్షిలో ఏదో తెలియని ఆనందం,ఏదో గెలిచాను అనే సంతోషం తో  ఆ విశాల ఆకాశంలో ఆ రెండు పక్షులు కనుమరుగు ఐపోయాయి. " ఆ పక్షి అల మైకంలోనే నవ్వుతూ ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ప్రాణం విడిచింది.

            "ప్రాణం పోయే ముందు చివరి క్షణం లో  కూడా ప్రేమించిన వ్యక్తిని తలుచుకోవడమే నిజమైన ప్రేమంటే....."
           

   
       

10, అక్టోబర్ 2015, శనివారం

Can love happens twice???

    నాకు  మళ్ళి ఈ బ్లాగ్ లో కధ రాయాల్సి వస్తుంది అనుకోలేదు, అది కూడా నా కధ,నా చివరి ప్రేమ కధ. ఒక సామేత ఉంటుంది,ప్రతి ముగింపు తరువాత ఒక కొత్త ప్రారంబం ఉంటుంది అని.
నేను ఎప్పుడూ నమ్మలేదు, కానీ అది నమ్మాలి అని నాకు కొంత కాలానికే అర్ధమయింది. తన గురించి మర్చిపోయి ఎప్పుడు ఒంటరిగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్న నాకు
మళ్ళి ఒక కొత్త ఆశను ఒక అమ్మాయి మళ్ళి కలిపించింది. మొదట్లో తను నాకు పరిచయం ఐనప్పుడు భయం వేసింది, మొదటిసారి దెబ్బ తిన్నప్పుడే కోలుకోడానికి రెండు సంవత్సరాల పట్టింది.
 మళ్ళి అలాజరిగితే మళ్ళి కోలుకోలేను అనిపించింది. అదే భయం తో తనతో లిమిట్స్ లో ఉంటూ వచ్చాను.

    ఆరు నెలల్లోనే ఇద్దరం మంచి స్నేహితులమైయం. రెండు సంవత్సరాల పడిన శ్రమ అంతా మర్చిపోయా,మళ్ళి ఒక కొత్త జీవితంలోకి అడుగు పెట్టినట్టు అనిపించింది.కోపం,బాధ,అసహ్యం,
నిరుచ్చాసం ఇలాంటివి అంటే ఏంటో మర్చిప్పోయా.సినిమాల్లో చుపించినట్టు స్నేహమే ప్రేమ కి మొదటి మెట్టు అనే విషయం నేను ఎప్పుడు నమ్మేవాడిని కాదు,నా స్నేహితులతో ఎప్పుడు వాదించే
వాడిని,స్నేహం ప్రేమగా ఎలా మారుతుంది అని,కానీ అది నా విషయం లో నిజమైంది అనిపించింది.

    కానీ తరువాత అర్ధమైంది నేను స్నేహాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నాను అని.ఒకరోజు తనతో చాట్ చేస్తునప్పుడు తనకి చెప్పాను తను అంటే నాకు ఇష్టం అని కానీ తను నన్ను ఎప్పుడు స్నేహితడు గానే బావించింది అని
చెపింది,తను అల చెప్పగానే ఎందుకో తెలియదు నా చెంపలపై ఏదో జారుతున్నాట్టు అనిపించింది,తడిమి చూస్తే తడి గా అనిపించింది,నాకు చాల వింతగా అనిపించింది,ఎందుకంటే ఆ తడి నా చేతికి
తగిలి చాల సంవత్సరాలైంది. ఒక్కసారిగా తల మిద ఏదో మోయలేని బరువు పెట్టినట్టు అనిపించింది.ప్రపంచం మొత్తం కొత్తగా అనిపించింది.

    తను పరిచయం ఐయే కంటే ముందు వరకు నా రోజువారీ జీవితం ఒకేలా ఉండేది.రోజు లో 8 నుండి 10 గంటల వరకు కష్టపడే వాడిని.ఎప్పుడు ఏదో కోల్పోయిన వాడిలా,నవ్వే తెలియని మనిషిలా
ఉండేవాడిని.తను పరిచయమైనా తరువాత అంతా మారి పొయింది.రోజు ఓ కొత్త అనుబవం,ఏదో  తెలియని సంతోషం కానీ  ఒక్కసారిగా అంతా ముక్కలైపోయినట్టు అనిపించింది.సెల్ ఫోన్ లో
ఏం టైప్ చేస్తున్నానో  కనిపించలేదు,కళ్ళు నీటితో నిండిపోయాయి,కన్నీటి బొట్లు ఒకదాని వెంట ఒకటి సెల్ ఫోన్ పై పడ్డాయి. నాకు గుర్తున్నంత వరకు అదే మొదటిసారి ఒక వ్యక్తి కోసం కన్నీరు కార్చడం.

    తానికి చెప్పేకంటే ముందే నిర్ణయం తీసుకున్న తను ఒప్పుకున్నా లేకున్నా ఇదే ఆకరిసారి అని, అవును అదే ఆకరిసారైంది కూడా. నాకు నా పాత జీవితమే బాగున్నాటు అనిపించింది,ఎందుకంటే
ఆ జీవితం లో నాకు నేనే ఉండేవాడిని,ఎపుడు నాకు నచ్చింది చేసేవాడిని,ఒక యంత్రం లా పని చేసేవాడిని,  ఆ జీవితంలోకి వెళ్ళడానికి వేసే మొదటి అడుగే ఈ కధ రాయడం.

    నాకు న్నేను అనుకున్న నేను ప్రేమించడానికి పనికి రాను అలాగే ప్రేమించడం రాదు అని.మొదటిసారి తొందర పడ్డాను,రెండోసారి స్నేహాన్ని తప్పుగా అర్ధంచేసుకున్నను.
చిన్నప్పటి నుండి చాల సార్లు చాల విషయాలలో ఓడిపోయాను కానీ ఎప్పుడూ ఒకే విషయం లో రెండు సార్లు ఓడిపోలేదు,మొదటిసారి ఓడిపోయాను.ఇక ఓడిపోకుడదు,ఓడిపోకుడదు అంటే మళ్ళి
ప్రయత్నం చెయ్యకూడదు.మొదటిసారి ఓడిపోయినప్పుడు అనుకున్నాను ఒంటరిగా ఉండాలి అని,ఇప్పుడు అదే అనుకుంటున్నాను కానీ ఈసారి కచ్చితంగా ఆకరిసారి అవుతుంది.
 ప్రతి కధ ముగింపు తరువాత ఒక కొత్త కధ మొదలు అవుతుంది,నా ప్రేమ కధకి ప్రారంబం లేని ముగింపు ఇది. మళ్ళి నా పాత జీవితంలోకి వెళ్తూ మీ............

2, మార్చి 2015, సోమవారం

Yes,I Have a Love story THE END

          చాల రోజులు అల గడిచిపోయింది. తనని మరిచిపోయాడని కి ఏదో ఒకటి నేర్చుకునేవాడిని,రోజు గంటల కొద్ది అల ఏదో ఒకటి నేర్చుకునే వాడిని.కానీ రోజు తనని చూడాల్సివస్తుంది.ఎంతగా ప్రయత్నిచినా తనని చూడకుండా ఉండలేకపోతున్నా.తనని చుసిన ప్రతి రోజు కనీసo 3-4 గంటలు ఏదో ఒకటి ట్రై చేసేవాడిని.రోజు అనుకునే వాడిని ఎలా ఐన మర్చిపోవాలి అని.

    ఎంత నేర్చుకున్న ఎంతగా ఏంచేసిన  తనని మర్చిపోలేకపోతున్న .రోజురోజుకి పని గంటలు పెంచుకుంటూ వెళ్ళాను కొన్నిరోజులు తరువాత ప్రశాంతంగా అనిపించింది. కొన్నిరోజులలో ఏ ఫీలింగ్స్ లేని మనషి లాగా తాయారు అయ్యాను,ఒక మనషిని అని మర్చిపోయాను ,మళ్ళి వేరే ఏ అమ్మాయి వైపు చూడలేదు.అందరిని ఒకే విధంగా చూడటం మొదలు పెట్టాను. ఆపుడే ఎవరు ఏంటో తెలిసింది,కొంతమంది దెగ్గర అయ్యారు,కొంత మంది ధూరం అయ్యారు.అల జరిగిన తరువాత తరువాత బెస్ట్ ఫ్రెండ్స్ పెరిగారు, నాకు ప్రతి విషయం లో నా పక్కన ఉండి ప్రోచ్చహించే వారు. ఒంటరిగా ఉండటం మంచిది అని ఫిక్స్ అయ్యాను,అల అనుకున్న తరువాత చాల సంతోషంగా అనిపించింది అల కొన్ని రోజులు గడిచిపోయాయి.
      

     కొన్ని రోజుల తరువాత నాకు ఒక అమ్మాయి పరిచయం ఐంది, ముందు తనే నన్ను అప్ప్రోచ్ ఐంది, నేను మాములుగానే మాట్లాడేవాడిని కానీ ఎందుకో తనతో మాట్లాడుతూ ఉన్నతాసేపు  నాకు ఎవరుగుర్తుకు వచ్చేవారు కాదు, కోద్దిరోజుల్లోనే తనపై నాకు ఇష్టం పెరిగింది ,కానీ తప్పు చేస్తుననేమో అనే ఫీలింగ్ నన్ను ప్రతి క్షణం బాధించింది. కొన్ని రోజుల తరువాత నాకు అర్ధం ఐంది తనకు   నా పై ఎలాంటి ఫీలింగ్ లేదు అని. తప్పు చేశాను అని అర్ధం ఐంది. నా మిద నాకే అసహ్యం వేసింది , నేను క్యారెక్టర్ లేని మనిషిల ప్రవర్తించాను అనిపించింది. ఎందుకు అల చేశాను , తప్పు చేశాను అని కొన్ని వేల సార్లు అనుకున్నాను. ఇంకో సరి అలంటి తప్పు చెయ్యకూడదు అనుకున్నాను . కానీ క్యారెక్టర్ కోల్పోయాను  అనే విషయం  ప్రతి క్షణం నన్ను బాధించింది. మనిషి ఏం కోల్పోఇనా క్యారెక్టర్ కోలోపోకోడదు కానీ నేను అదే కోలోపోయాను. అందుకే నేను ఎవరీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యాలి అనుకోలేదు అలాగే ఎవ్వరిని నా లైఫ్ రానివ్వకుడదు అనుకున్నును. ఒక యంత్రం ల పని చేసే నేను ఏం ఫీలింగ్స్ కూడా లేకుండా ఉండాలి అని అనుకున్నను.మళ్ళి ఎలాంటి తప్పు చెయ్యకూడదు అని ఫిక్స్ అయ్యాను.
          "ఇపుడు నేను ఏ ఫీలింగ్స్ లేని మనిషిలా కనిపించే యంత్రాన్ని."
                                                      I want to be single forever


                                                 THE END

       

5, నవంబర్ 2014, బుధవారం

Yes, I have a Love story Part-2

  
  1st year ఐయిoది,2nd year ఒక  కొత్త ఉత్సాహం తో స్టార్ట్ చేసాను.కాలేజీ 1st day అన్ని మర్చిపోయి  కాలేజీ లోకి అడిగుపెట్టాను.ఆ రోజు ఏం క్లాసులు జరగకపోవడంతో కాలేజీ నుంచి త్వరగా బయటకు వచ్చాము.కాలేజీ బయట ఒక హోటల్ ఉంది.నేను ఇంకా ఫ్రెండ్స్ ఉంటె అందరo హోటల్లో కి వెళ్ళాము,ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు.నేను మాత్రం ఇనుప స్తంబం ఉంటె దానికి ఆనుకొని నిల్చున్నాను.కొంచం సెపు మాట్లాడుకున్న తరువాత బస్సు వస్తుందని బయటకు వచ్చాము.బయటకు రాగానే హోటల్ మీద కరెంటు తీగ తెగిపడింది.పెద్దగా నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి.ఆ హోటల్ ఇనుప రేకులతో వేసి ఉంది.మేం ఇంకో 10 సెకనులు అక్కడే ఉంటె నా పని ఐపోయేది. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఎవరి ఇంటికి వాళ్ళు వేల్లిపోయాం.

     మనసుకు, మెదడుకి చాలా పెద్ద తేడా ఉంది.మనసు నమ్మడానికి కారణాలు వెతకదు,కానీ మెదడు ఎప్పుడు ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటుంది.మెదడు మనసు చెప్తే వింటుంది,కానీ మనసు తన మాటే తను వింటుంది.నేను తనని ఇష్టపడటానికి ఎప్పుడు కారణం వెతక లేదు.కానీ తనని మర్చిపోవడానికి కారణాలు వెతికాను.ఇష్టపడటం అనేది మనసుకు సంబందించినది,నమ్మకం మెదడుకు సంబందిoచినది.ఒక్కసారి నిజంగా ఇష్టపడితే చనిపోయే చివరి క్షణం వరకు,చివరి క్షణం వరకేంటి చనిపోయిన తరువాత,ఇంకా చెప్పాలి అంటే జన్మజన్మల వరకు మర్చిపోవడం కుదరదు.అదే నా జీవితం లో నిజం ఐయిoది.వారం తురువాత కాలేజీ కి వెళ్ళాను.కాలేజీ లో  తనని చూసాను,తనని చూడగానే అన్ని మర్చిపోయాను,మళ్ళి తనను ఇష్టపడం మొదలు పెట్టాను.

      రెండు రోజుల వరకు తనని చూస్తూనే  ఉన్నాను.కానీ ఒక్క క్షణం ఆలోచించాను,నేను చెసేది తప్పా,ఒప్పా అని.వేరే ఒకరిని ఇష్టపడే వారిని నేను ఇష్టపడటం తప్పు అనిపించింది.మర్చిపోవాలి,మర్చిపోవాలి,మర్చిపోవాలి ఇలా కొన్ని వేలసార్లు అనుకోని ఉంటా.ఏం చేసిన తనే గుర్తుకు వస్తుంది.ఏం చెయ్యాలి,ఏం చెయ్యాలి ఇలా అనుకుంటున్నా సమయంలో క్లాస్ లో ఒకతను మంచి ఫ్రెండ్ అయ్యాడు.వాడితో ఉన్నoత సేపూ అన్ని మర్చిపోయే వాడిని.ఎప్పుడు నావ్విస్తూ ఉండేవాడు.(ఇంకా ఉంది)......   

3, నవంబర్ 2014, సోమవారం

Yes, I have a Love story Part-1

Yes, I have a Love story

------------------------------------------------------------------------------------------------

        నా పేరు వంశీ,అందరు ఆ బ్రహ్మ మనుషుల తల రాతలు రాస్తాడు అంటారు.కానీ నేను నా తలరాత నాకు నచ్చినట్టుగా రాసుకున్నాను.నాకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాను.
  
         నేను 7 వ తరగతి లో ఉన్నప్పుడు మా బావని చూసి ఎలాగైన Software Engineer అవ్వాలి అనుకున్నాను.ఇంటర్ ఐపోయింది.కంప్యూటర్ సైన్సు లో జాయిన్ అయ్యాను.జాయిన్ ఐన ప్రతి రోజు నుంచి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేసాను.కానీ నేను అనుకున్నవిధంగా నేర్చుకోలేకపోయాను.పక్కన ఉన్నవాల్లనుంచి ఏదో ఒకటి నేర్చుకుందాం అనుకుంటే వాళ్ళు నేర్చుకోడానికన్నా ఎంజాయ్ చెయ్యడానికి   ఎక్కువగా చూస్తున్నారు అని తెలిసి,నేను ఏమి నేర్చుకోలేను అని అనిపించి నేను కుడా ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాను.కాలేజీ లో జాయిన్  ఐన 10 రోజుల తరువాత ఒక అమ్మాయిని చూసాను.తనని చూడగానే నా కోసమే పుట్టింది అనిపించింది.రోజు తనని చూస్తూ కాలం గడిపాను.కొంతకాలం తరువాత తనకి నేను తనని ఇష్టపడుతున్నును అని తనకు తెలిసింది.తను తనకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది.తను నో చెప్పలేదు కదా అని తన కోసం వెయిట్  చేస్తునే ఉన్నాను.1st year ఎగ్జామ్స్ కి వారం ఉంది అనగా తను ఎవరినో ఇష్టపడుతుంది అని తెలిసింది.ఏం చెయ్యాలో అర్ధం కాలేదు,ఎగ్జామ్స్ కి అసలు చదవలేక పోయాను.అందువల్ల ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేకపోయాను.ఎగ్జామ్స్ తరువాత హాలిడేస్ వచ్చాయి. రోజు తనే గుర్తుకు వచ్చేది.నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను.ఒంటరిగా ఎన్నో రోజులు  ఉన్నాను.ఏం చెయ్యాలి,ఏం చెయ్యాలి ఏం అర్ధం కావడం లేదు.ఒక్కసారి జరిగింది అంత గుర్తుకు తెచ్చుకున్నాను.టైం వేస్ట్ చేస్తున్నాను అనిపించింది.

       ఏదో ఒకటి నేర్చుకోవాలి అని అనుకున్నాను.ఫస్ట్ నన్ను నేను నమ్మాలి,నమ్మాను.నా దేగ్గర నేర్చుకోడానికి ఉన్నాఒకేఒక్క ఆయుధం నా సెల్ ఫోన్ Nokia 110 Rs.2300.ఆ మొబైల్  ఏం చేయ్యగలను అనిపించింది.ఒకసారి నాకు ఏం తెలుసో ఆలోచించాను .నేను 1st year లో ఉన్నపుడు సెమినార్ కోసం అని పేస్ బుక్ గురించి చదివాను.అప్పుడు నాకు అనిపించ్చింది,నేను కుడా ఒక వెబ్ సైట్ ఓపెన్ చెయ్యాలి అని.అందుకని వెబ్ డిజైన్ గురించి తెలుసు కోవడం మొదలుపెట్టాను.మొదలు పెట్టినపుడు కష్టంగా అనిపించింది.ఐన వదిలి పెట్టలేదు.

     కొద్ది రోజుల తరువాత  1st year రిజల్ట్స్ వచ్చాయి.ఘోరంగ ఫెయిల్ అయ్యాను.నేను ఫెయిల్ ఐనందుకు ఇంట్లో ఎవరు ఏం అనలేదు.అప్పుడు అనిపించింది నేను నేర్చుకోవడంతో పాటు చదవాలి అని.

     నాకు పేస్ బుక్ లో పేజి ఉండేది.ఒకరోజు ఎవరో నా ఎకౌంటు ను hack చేసి పేజిని తిసేసుకున్నారు.ఎలా ఐనా ఆ పేజిని వెన్నక్కు తీసుకు రావాలి ఎంతగానో ట్రై చేసాను.కానీ అది కష్టం అని తెలిసింది.అప్పుడే నేను హాకింగ్ గురించి తెలుసుకున్నాను .హాకింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టాను.....(ఇంకా ఉంది).

Jannat Part-5 The End

          కాలేజీలో  Freshers Party జరగడానికి ముందు రోజు dance practice ఉండటం వల్ల క్లాసులు జరగడం లేదు అని కాలేజీ కి లేట్ గా వెళ్ళాను,అంటే నేను dance వేసి జనాలను బయపెట్టడానికి కాదు,ఫ్రెండ్ ని encourage చెయ్యడానికి వెళ్ళాను .ఆరోజున దేవత కాలేజీ కి రాలేదు అని తెలిసింది,చాలా బాధగా కాలేజీ బయటకు నడుచుకుంటూ వెళ్ళాను,కాలేజీ బయట చాలా మంది నిల్చొని ఉన్నారు,నేను అందరిని ఒకసారి చూసాను.అక్కడ తను ఉంది దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా నిల్చొని ఉంది.ఎల్లో చుడిదార్,రెడ్ చున్ని లో నిజంగా తను నా కళ్ళకు దేవత లా కనిపించింది.తనని అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపించింది.కానీ ఫ్రెండ్స్ టైం అవుతుందని నన్ను లాక్కొనిపోయారు.తరువాత రోజు పార్టీ లో తను dance వేసింది,హింది సాంగ్ కి అనుకుంట!,తను స్టేజి మీద dance వేసేనట్టు అనిపించలేదు,నా గుండె పై dance వేసినట్టు అనిపించింది.

      అలా తనను సంవత్సరం పాటు తనని  చూస్తూనే ఉన్నాను.అల హ్యాపీగా సాగిపోతున్న నా ప్రేమకథ ఊహించని మలుపు తిరిగింది.ఒక రోజు నా దేవత దెగ్గరనుండి సందేశం వచ్చింది.నేను తన వెంట పడుతుంటే తనకు ఇబ్బందిగా ఉందంట,నేను అంటే తనకు చిరాకు,తనవెంట పడవద్దు అనిచెపింది.తను జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనుకున్న.కానీ తను నావల్లే ఇబ్బంది పడుతుందన్న విషయం నన్ను బాధించింది.అందుకే తనకు వెళ్లిపోవాలి అనుకున్న,తన సంతోషం కంటే నాకు ఇంకేం కావాలి?,కానీ తనని చూస్తూ నేను పొందే ఆనందం నాకు మళ్ళి దొరకదు.

    అల సవత్సరం గడిచి పొయింది.  ఇప్పుడు తను ఫైనల్ ఇయర్  ఇంకోద్ది రోజులలో తను వెళ్ళిపోతుంది.తిరిగిరాని ఆ క్షణాలను గుర్తు చేసుకొని ఆనంద పడాలో? లేక కరిగిపోతున్న ఈ కొద్ది కలాన్నీ చూసి బాధ పడాలో ఆర్ధం కాలేదు.ఆపుడప్పుడు అనిపిస్తుంది తనను నన్ను ఒక్కసారికూడా గుర్తు చేసుకోదా అని!.తనకి నేనేదుకు  తన కోసం ఆరాటపడుతున్నానని అనిపించదా!?.తనను సూటిగా నన్ను ఈ విషయం అడిగితే చెప్పాలి అనిఉంది.ప్రపంచం అంతా వినిపించేలా,నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని.
తనని ఎలా ఐనా ఒక రోజు కలుసుకోవాలి అనుకున్నను.నేను కలుసుకోవాలి అనుకున్న రోజు వచ్చింది.

"నాకు చెప్పే దైర్యం లేదు,విని ఆంగీకరించే  శక్తి తనకు లేదు".
ఐనా దైర్యం చేసి తన ఎదుటకు వెళ్లి నిల్చున్నా.!!!  

"నీ కోసం పరితపించే  హృదయం
నీ కోసం ఎదురుచుసే నయనం
నీ కోసం నడక సాగించే పాదాలు
నిన్ను స్మ్రుషించే భాగ్యం కోసం వేచైన చేతులు
నీ పేరు పలికే నా పెదవులు
నిన్ను తలిచి పులకించే నా తనవు
నీ ప్రేమ కోసమై వేచివున్న ప్రాణం నికే   అంకితం

నీ మనసులో స్థానం కోసం 
మరణాన్ని చవి చూసైనా 
      నిన్ను చేరుతా"

ఇట్లు 
నీ కోసం వేల సవత్సరాలైన  ప్రేమతో ఎదురుచూసే  
 నీ
కార్తిక్.
-----------------------------------------------------------------------
The End