Telugu Prema Kathalu

పేజీలు

3, నవంబర్ 2014, సోమవారం

Jannat Part-5 The End

          కాలేజీలో  Freshers Party జరగడానికి ముందు రోజు dance practice ఉండటం వల్ల క్లాసులు జరగడం లేదు అని కాలేజీ కి లేట్ గా వెళ్ళాను,అంటే నేను dance వేసి జనాలను బయపెట్టడానికి కాదు,ఫ్రెండ్ ని encourage చెయ్యడానికి వెళ్ళాను .ఆరోజున దేవత కాలేజీ కి రాలేదు అని తెలిసింది,చాలా బాధగా కాలేజీ బయటకు నడుచుకుంటూ వెళ్ళాను,కాలేజీ బయట చాలా మంది నిల్చొని ఉన్నారు,నేను అందరిని ఒకసారి చూసాను.అక్కడ తను ఉంది దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా నిల్చొని ఉంది.ఎల్లో చుడిదార్,రెడ్ చున్ని లో నిజంగా తను నా కళ్ళకు దేవత లా కనిపించింది.తనని అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపించింది.కానీ ఫ్రెండ్స్ టైం అవుతుందని నన్ను లాక్కొనిపోయారు.తరువాత రోజు పార్టీ లో తను dance వేసింది,హింది సాంగ్ కి అనుకుంట!,తను స్టేజి మీద dance వేసేనట్టు అనిపించలేదు,నా గుండె పై dance వేసినట్టు అనిపించింది.

      అలా తనను సంవత్సరం పాటు తనని  చూస్తూనే ఉన్నాను.అల హ్యాపీగా సాగిపోతున్న నా ప్రేమకథ ఊహించని మలుపు తిరిగింది.ఒక రోజు నా దేవత దెగ్గరనుండి సందేశం వచ్చింది.నేను తన వెంట పడుతుంటే తనకు ఇబ్బందిగా ఉందంట,నేను అంటే తనకు చిరాకు,తనవెంట పడవద్దు అనిచెపింది.తను జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనుకున్న.కానీ తను నావల్లే ఇబ్బంది పడుతుందన్న విషయం నన్ను బాధించింది.అందుకే తనకు వెళ్లిపోవాలి అనుకున్న,తన సంతోషం కంటే నాకు ఇంకేం కావాలి?,కానీ తనని చూస్తూ నేను పొందే ఆనందం నాకు మళ్ళి దొరకదు.

    అల సవత్సరం గడిచి పొయింది.  ఇప్పుడు తను ఫైనల్ ఇయర్  ఇంకోద్ది రోజులలో తను వెళ్ళిపోతుంది.తిరిగిరాని ఆ క్షణాలను గుర్తు చేసుకొని ఆనంద పడాలో? లేక కరిగిపోతున్న ఈ కొద్ది కలాన్నీ చూసి బాధ పడాలో ఆర్ధం కాలేదు.ఆపుడప్పుడు అనిపిస్తుంది తనను నన్ను ఒక్కసారికూడా గుర్తు చేసుకోదా అని!.తనకి నేనేదుకు  తన కోసం ఆరాటపడుతున్నానని అనిపించదా!?.తనను సూటిగా నన్ను ఈ విషయం అడిగితే చెప్పాలి అనిఉంది.ప్రపంచం అంతా వినిపించేలా,నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని.
తనని ఎలా ఐనా ఒక రోజు కలుసుకోవాలి అనుకున్నను.నేను కలుసుకోవాలి అనుకున్న రోజు వచ్చింది.

"నాకు చెప్పే దైర్యం లేదు,విని ఆంగీకరించే  శక్తి తనకు లేదు".
ఐనా దైర్యం చేసి తన ఎదుటకు వెళ్లి నిల్చున్నా.!!!  

"నీ కోసం పరితపించే  హృదయం
నీ కోసం ఎదురుచుసే నయనం
నీ కోసం నడక సాగించే పాదాలు
నిన్ను స్మ్రుషించే భాగ్యం కోసం వేచైన చేతులు
నీ పేరు పలికే నా పెదవులు
నిన్ను తలిచి పులకించే నా తనవు
నీ ప్రేమ కోసమై వేచివున్న ప్రాణం నికే   అంకితం

నీ మనసులో స్థానం కోసం 
మరణాన్ని చవి చూసైనా 
      నిన్ను చేరుతా"

ఇట్లు 
నీ కోసం వేల సవత్సరాలైన  ప్రేమతో ఎదురుచూసే  
 నీ
కార్తిక్.
-----------------------------------------------------------------------
The End  

కామెంట్‌లు లేవు: