Telugu Prema Kathalu

పేజీలు

1, నవంబర్ 2014, శనివారం

Jannat Part-4

      వారం రోజులు పిచ్చివాడిలా కాలేజీ మొత్తం తిరిగాను.ఆ రోజు నాకు ఇంకా గుర్తు ఉంది,కాలేజీ అయిపోయిన తరువాత తను కాలేజీ బయట బస్సు కోసం ఎదురుచూస్తూ ఉంది,నేను వెనుకే నిల్చొని ఉన్నాను,తన ఫ్రెండ్ ఎవరో తనని పెద్దగా ఆపూర్వ(పేరు మార్చబడినది) అని పిలిచారు.నాకు ఒక్కసారే షాక్ కొట్టినట్లు అనిపించింది.ఆ పేరు నా మనసులో కొన్ని వేలసార్లు తలుచుకొని ఉంటా.
"నే వాన చినుకునైనా బాగుండేది 
నీ మేనుపై చిరుజల్లులా కురిసి మురిసి పోవడానికి..
చిరుగాలినైనా బాగుండేది 
నీ శ్వాసలో కలిసి కరిగి పోవడానికి... 
ధూళి రేణువునైన మగుండేది
నీ ఆడుగులకు మడుగులొతి నలిగి పోవడానికి...
కనీసం ఒక ప్రేమలేకనైనా కాకపోతిని
నీపై నా ప్రేమని తెలుపడానికి......"
    తన కోసం రోజు నేను కాలేజీ బయట నిల్చొనే వాడిని తను బస్సు దిగి నడుచుకుంటూ ఎదురుగా వస్తుంటే తనని ఫస్ట్ టైం  చూసినపుడు యే ఫీలింగ్ ఐతే కలిగిందో,నాలో ఎంత ఆనందం కలిగిందో అదేబావన ప్రతి రోజు కలిగేది.తనతో మాట్లాదాలి అని తనతో పరిచయం పెంచుకోవాలని అనిపించేది.కానీ ఎక్కడో ఏదో తెలియని బయం  తను నా ఎదురుగా ఉంటె నా కాలం ఆగిపోతుంది.అలాగే ర్రోజు తనని చూస్తూ అనడః ఒఅడే వాడిని అలా చాలా కాలం గడిచి పొయింది.హటాత్తుగా తనకు preparation holidays ఇచారు.అందు వల్ల తనని ౨ నెలల వరకు చూడలేక పోయాను.ఒక్క సరిగా మా కాలేజీ నాకు శ్మశానం లాగా కనిపించింది.ఆ 2 నెలలు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.ఒక రోజు తన exam center కనుక్కొని అక్కడికి వెళ్ళాను.అందరు నన్ను వింతగా చూస్తున్నారు.కానీ నేను మాత్రం తన కోసం చూస్తున్నాను.
 
Exam స్టార్ట్ అవ్వడానికి పది నిమిషాలు మాత్రమే ఉంది కానీ తన జాడ లేదు.ఆప్పుడు ఒక్క సరిగా తను నా ఎదురుగా నడుచుకుంటూ వస్తుంది .2 నెలలుగా తనని చూడని నాకు తనని అల చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది.బీడు బారిన భూమిపై తిలకరి జల్లు కురిసినట్టు నా యద తనని చూసి ఉప్పొంగి పొయింది...(ఇంకా ఉంది).
     

కామెంట్‌లు లేవు: