Telugu Prema Kathalu

పేజీలు

30, అక్టోబర్ 2014, గురువారం

Jannat Part-3

"మూగాబోయిన నా కాలం కు కదలిక తెచ్చింది తన అందం
మరుగున పడిన నా లోని బావలను తట్టిలేపింది ఆ సోయగం
నిద్దుర పోతున్న నా ఆశలకు ఊపిరి ఊదిoది ఆ నయనం
   చలనం లేని ఈ ప్రాణానికి తిరిగి జీవం పోసింది తన స్నేహం

ఏనాటికైనా తనని చేజరానివ్వకంటుంది నా హృదయం"

      కాలేజీలో రెండోవ రోజు,ఉదయాన్నే రామ్ ఫోన్ చేసాడు.ఇద్దరం కలిసి కాలేజీ కి వెళ్ళాము,కాలేజీలోకి ఆడుగు పెడుతూనే తన గురించి చూడటం మొదలు పెట్టాను,రామ్ నన్ను చూసి అడిగాడు తన కోసం వెతుకుతున్నవా అని,నేను రామ్ వైపు చూసి చిన్నగా నవ్వాను,కానీ వాడు పెద్దగా నవ్వాడు.కొంచం సెపు కాలేజీలో తిరిగాం,తరువాత సెమినార్ హాల్ లో orientation class ఉంది అంటే వెళ్ళాము,వెళ్ళగానే ప్రిన్సిపల్ సర్ మాట్లాడుతున్నారు,ఈరోజు కుడా ఏదేన అనుకుంటూ లోపకి వెళ్ళాము.ఇద్దరం హాల్ లోపలోకి వెళ్లి ఒకే చోట కూర్చున్నాము,నాకళ్ళు నాకు తెలియకుండానే తనను వెతుకుతున్నయి,కానీ రామ్ మాత్రం సర్ చెప్పెది చాలా శ్రద్ధగా వింటున్నాడు,కానీ నాకు ఏమి వినిపించడం లేదు,ఎక్కడ ఎక్కడ,నా కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి. కొంచంసేపటి తరువాత ప్రిన్సిపల్ సర్ ఒక్కొక బ్రాంచ్ వాళ్ళని బయటకు వెల్లమంట్టున్నాడు,ఇప్పటి వరకు తను కనిపించ లేదు,ఇప్పుడు రామ్ కుడా కనిపించడు.ఎందుకంటే రామ్ వేరే బ్రాంచ్,నేను వేరే బ్రాంచ్ ఫస్ట్ నేను బయటకు వెళ్ళాను.

        ఒక సర్ మా బ్రాంచ్ వాళ్ళందరిని తీసుకొని కాలేజీ మొత్తం తిప్పి చూపిస్తున్నారు.నేను సర్ చెప్పెది వింటూనే తనకోసం వెతుకుతున్నాను.కొంచం సేపటి తరువాత సర్ లంచ్ కి వెళ్లి గంట లో తిరిగి రావాలి అని చెప్పారు. లంచ్ కోసం కాంటీన్ కి వెళ్ళాలి,నేను రామ్ కోసం వెతికాను కానీ నాకు వాడు కనిపించలేదు,కాంటీన్ దెగ్గర  ఉన్నాడేమో అని అక్కడికి వెళ్ళాను,కాంటీన్కి వెళ్తుంటే నన్ను ఎవరో దాటేసి వెళ్తున్నారు అనిపించింది.ఒక అమ్మాయి తన ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ నన్ను దాటేసి వెళ్తుంది.ఆ అమ్మాయి వైట్ చుడిదార్  లో దేవతలలా,కడిగిన ముత్యంలా నడుచుకుంటూ వెళ్తుంది,తను ఎవరో చుద్దామని తన వెనుక వెళ్తుంటే న బుజం మీద ఎవరో చైవేసినట్టు అనిపించింది నేను ఎవరా అని వెన్నక్కి తిరిగి చూసాను,నా మీద చైవేసింది రామ్.ఇద్దరం కలిసి లంచ్ చేసాము లంచ్ అయిన తరువాత కాంటీన్ నుంచి బయటకు వస్తుంటే నాకు ఎదురుగా తను వచ్చింది.నేను షాక్ అయ్యాను,ఎందుకంటే అంతకముందు నన్ను దటవేసిన వైట్ చుడిదార్ అమ్మాయి తనే.ఆ రోజు మొత్తం తనకు కనిపించకుండా తన వేనికే తిరిగాను,తన పేరు,బ్రాంచ్ తెలుసుకుందాం అని ఎంత ట్రై చేసిన తెలియలేదు.  (ఇంకా ఉంది).

కామెంట్‌లు లేవు: