Telugu Prema Kathalu

పేజీలు

28, అక్టోబర్ 2014, మంగళవారం

Jannat Part-1

Jannat(స్వర్గం)
-----------------------------------------------------------------------------------------------------------------
              నా పేరు కార్తీక్(పేరు మార్చ బడినది).నేను జీవితంలో  మర్చిపోలేని రోజు ఏదైనా ఉంది అంటే అది 
21 సెప్టెంబర్ 2012.ఆ రోజు ఫస్ట్ టైం కాలేజీకి  చాలా హ్యాపీ గా వెళ్ళాను,కాలేజీ లోపలికి వెళ్ళగానే సెమినార్ హాల్ లోపలి వెళ్ళమన్నారు,సెమినార్ హలో orientation class conduct చేస్తున్నారు అని చెప్పారు. సెమినార్  హాల్  2nd floor లో ఉంది,చచ్చానురా దేవుడా అనుకున్న,కష్టపడి సెమినార్ హాల్  లోపలి వెళ్ళాను.హాల్ లోపలికి వెళ్ళగానే షాక్ అయ్యాను,అందరు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తో వచ్చారు,నేను బిక్కా మోకం వేసుకొని కల్లిగా ఉన్న చైర్ లో వెళ్లి కూర్చున్నాను,స్టేజి మీద ఉన్నవాళ్లు హడావుడిగా తిరుగుతూ ఉన్నారు.ఒకసారి చుట్టూ తిరిగి చూసాను అందరు చాలా హ్యాపీ గా ఉన్నారు,పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు,నాన్నకు డ్యూటీ ఉండటం వల్ల నాన్న రాలేకపోయారు,నేను ఒంటరిగా ఫీల్ అయ్యాను.ఇంతలో నాపక్కన ఎవరో వచ్చి ఎవరో కూర్చున్నారు,నాకు అప్పుడు తెలియదు నా పక్కన కుర్చున వ్యక్తి మంచి ఫ్రెండ్ కాబోతున్నాడు అని. 5 ని" తరువాత టైం ఎంత అని అడిగాడు,నేను 9:50 అని చెప్పాను.తరువాత పరిచయం చేసుకున్నాం,తన పేరు రామ్(పేరు మార్చ బడినది) అని  చెప్పాడు,వాడు ఓపికగా ప్రశ్నలు అడుగుతున్నాడు నేను ఓపికగా సమాధానాలు చెప్తూనే ఉన్నాను.

           ప్రోగ్రాం స్టార్ట్ చేసారు,ఒకరి తరువాత ఒకరు speech లు ఇస్తునే ఉన్నారు.నాకు చాలా బోర్ అనిపించింది,నా చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం  హరి కధ విన్నట్టు వింటున్నారు.మా ఓపిక నశించకుండా ఉండటానికి Maaza  ఇచ్చారు.చాలా మంది speech లు ఇవ్వడం వల్లా బుర్రా హీట్ ఎక్కింది.పెద్ద వాళ్ళు speech ఇచ్చిన తరువాత స్టూడెంట్స్ వల్లా అనుబవాలు స్టేజి పైకి ఎక్కి చెప్తున్నారు.fresher అనుకుంట ఒక అమ్మాయి స్టేజి పైకి ఎక్కి మాట్లడుతు ఉంది,రామ్ ఆ అమ్మాయి వైపు ఆలా చస్తూనే ఉన్నాడు........,ఇంతలో నాకు ఫోన్ కాల్ వచ్చింది,నేను ఫోన్ లో మాట్లడుతున్నపుడు ఒక అమ్మాయి ని పిలిచారు, నేను విసుగ్గా స్టేజి వైపు ఇంకా ఎంత సేపు ఉంది అన్నట్టు చూసాను,ఒక్క సారి కాలం ఆగిపోఇనట్టు అనిపించింది.ఒక దేవత లా స్టేజి మేధా మాట్లడుతూ ఉంది.ఆ క్షణం నా గుండె చప్పుడు నాకు స్పష్టంగా వినిపించింది.తను ఏం మాట్లాడిందో తెలియదు,కానీ తను గొంతు చాలా బాగుంది.నేను తన వైపు చూస్తూ ఉంటె రామ్ తన గురించి నాతో ఒకటి చెప్పాడు......(ఇంకా ఉంది)    

           

కామెంట్‌లు లేవు: