Telugu Prema Kathalu

పేజీలు

3, నవంబర్ 2014, సోమవారం

Yes, I have a Love story Part-1

Yes, I have a Love story

------------------------------------------------------------------------------------------------

        నా పేరు వంశీ,అందరు ఆ బ్రహ్మ మనుషుల తల రాతలు రాస్తాడు అంటారు.కానీ నేను నా తలరాత నాకు నచ్చినట్టుగా రాసుకున్నాను.నాకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాను.
  
         నేను 7 వ తరగతి లో ఉన్నప్పుడు మా బావని చూసి ఎలాగైన Software Engineer అవ్వాలి అనుకున్నాను.ఇంటర్ ఐపోయింది.కంప్యూటర్ సైన్సు లో జాయిన్ అయ్యాను.జాయిన్ ఐన ప్రతి రోజు నుంచి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేసాను.కానీ నేను అనుకున్నవిధంగా నేర్చుకోలేకపోయాను.పక్కన ఉన్నవాల్లనుంచి ఏదో ఒకటి నేర్చుకుందాం అనుకుంటే వాళ్ళు నేర్చుకోడానికన్నా ఎంజాయ్ చెయ్యడానికి   ఎక్కువగా చూస్తున్నారు అని తెలిసి,నేను ఏమి నేర్చుకోలేను అని అనిపించి నేను కుడా ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాను.కాలేజీ లో జాయిన్  ఐన 10 రోజుల తరువాత ఒక అమ్మాయిని చూసాను.తనని చూడగానే నా కోసమే పుట్టింది అనిపించింది.రోజు తనని చూస్తూ కాలం గడిపాను.కొంతకాలం తరువాత తనకి నేను తనని ఇష్టపడుతున్నును అని తనకు తెలిసింది.తను తనకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది.తను నో చెప్పలేదు కదా అని తన కోసం వెయిట్  చేస్తునే ఉన్నాను.1st year ఎగ్జామ్స్ కి వారం ఉంది అనగా తను ఎవరినో ఇష్టపడుతుంది అని తెలిసింది.ఏం చెయ్యాలో అర్ధం కాలేదు,ఎగ్జామ్స్ కి అసలు చదవలేక పోయాను.అందువల్ల ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేకపోయాను.ఎగ్జామ్స్ తరువాత హాలిడేస్ వచ్చాయి. రోజు తనే గుర్తుకు వచ్చేది.నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను.ఒంటరిగా ఎన్నో రోజులు  ఉన్నాను.ఏం చెయ్యాలి,ఏం చెయ్యాలి ఏం అర్ధం కావడం లేదు.ఒక్కసారి జరిగింది అంత గుర్తుకు తెచ్చుకున్నాను.టైం వేస్ట్ చేస్తున్నాను అనిపించింది.

       ఏదో ఒకటి నేర్చుకోవాలి అని అనుకున్నాను.ఫస్ట్ నన్ను నేను నమ్మాలి,నమ్మాను.నా దేగ్గర నేర్చుకోడానికి ఉన్నాఒకేఒక్క ఆయుధం నా సెల్ ఫోన్ Nokia 110 Rs.2300.ఆ మొబైల్  ఏం చేయ్యగలను అనిపించింది.ఒకసారి నాకు ఏం తెలుసో ఆలోచించాను .నేను 1st year లో ఉన్నపుడు సెమినార్ కోసం అని పేస్ బుక్ గురించి చదివాను.అప్పుడు నాకు అనిపించ్చింది,నేను కుడా ఒక వెబ్ సైట్ ఓపెన్ చెయ్యాలి అని.అందుకని వెబ్ డిజైన్ గురించి తెలుసు కోవడం మొదలుపెట్టాను.మొదలు పెట్టినపుడు కష్టంగా అనిపించింది.ఐన వదిలి పెట్టలేదు.

     కొద్ది రోజుల తరువాత  1st year రిజల్ట్స్ వచ్చాయి.ఘోరంగ ఫెయిల్ అయ్యాను.నేను ఫెయిల్ ఐనందుకు ఇంట్లో ఎవరు ఏం అనలేదు.అప్పుడు అనిపించింది నేను నేర్చుకోవడంతో పాటు చదవాలి అని.

     నాకు పేస్ బుక్ లో పేజి ఉండేది.ఒకరోజు ఎవరో నా ఎకౌంటు ను hack చేసి పేజిని తిసేసుకున్నారు.ఎలా ఐనా ఆ పేజిని వెన్నక్కు తీసుకు రావాలి ఎంతగానో ట్రై చేసాను.కానీ అది కష్టం అని తెలిసింది.అప్పుడే నేను హాకింగ్ గురించి తెలుసుకున్నాను .హాకింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టాను.....(ఇంకా ఉంది).

కామెంట్‌లు లేవు: