Telugu Prema Kathalu

పేజీలు

12, అక్టోబర్ 2015, సోమవారం

Wings

గమనిక: కధ,కధలోని పాత్రలు కల్పితం.          
    ఒకానొక మాయ ప్రపంచయం లో ఒక అమాయక పక్షి నివసిస్తూ ఉండేది. ఆ పక్షికి ఒకరోజు విశాలమైన ఆకాశంలో విహరిస్తూ ఉండగా ఒక అందమైన పువ్వును చూసి ఆశ్చర్యపోయి,ఆ ఆశ్చర్యంలో మొక్కపై ఉన్న ముళ్ళను గమనించకుండా  ఆ పువ్వుఉన్న మొక్కపై వాలింది, ఆ ముళ్ళు  వాడిగా ఉండటం వల్ల ,ఆ ముళ్ళు పక్షి ఒక  రెక్కలోకి దిగిపోయాయి,ఆ ముళ్ళు పక్షి  రెక్కని చిల్చినంత పని చేసాయి.పక్షి రెక్క నుండి ధారల రక్తం  కారసాగింది, ఆ రక్తం వల్ల పువ్వు సౌందర్యం పాడు అవతుంది అని, గాయం ఐన రెక్కను చూసుకుంటూ వేరే రెక్కతో అక్కడి నుండి ఎగిరిపోయింది.

    కొన్ని రోజులకు గాయం మానిపోయింది కానీ గాయం ఐన రెక్క మాత్రం నిర్జివం లేకుండా పోయింది,జీవం ఉన్న ఒక రేక్కతోనే విహరిస్తూ ఉండేది, కొంతకాలానికి ఒక అందమైన పక్షి మొదటి పక్షితో చెలిమి కోరింది,మొదటి పక్షి బయపడుతునే చెలిమి చేసింది,కొంత కాలానికి మొదటి పక్షి ప్రేమలో పడింది కానీ తమ చెలిమి ముక్కలవుతుంది అని ఆ విషయం రెండో పక్షికి ఎపుడు చెప్పలేదు, కొంత కాలానికి రెండో పక్షి తనతో మెలిగే విధానం చూసి ఆ పక్షికి  తను అంటే ఇష్టం అనుకోని పోరపడి,ఎంతో సంతోషంగా ఉండసాగింది.

    అన్ని మనస్సులు ఒకేలే ఉండవు అనే సత్యాన్ని మొదటి పక్షి అర్ధం చేసుకోలేక,రెండో పక్షిని ప్రేమిస్తున్న విషయం చెప్పింది,కానీ  ఆ మాట విన్న రెండో  పక్షి ఆశ్చర్యపోయి, తను ఎపుడు స్నేహంగానే మేలిగాను,తన లో ఎపుడు అలాంటి బావం ఏనాడూ కలగలేదు అని చెప్పింది. ఆ మాట విన్న మొదటిపక్షి కనీరు కార్చింది, కానీ ఎందుకో వెంటనే ఆపెసింది.ఆకాశం లో బాధతో విహరిస్తున్న పక్షి ఒక్కసారిగా కిందకు పడసాగింది,అల కింద పడుతుండగా తన జీవితం తన కళ్ళముందు కదిలింది, తను ఆకరిగా బాధ పడిన సంఘటన తన మదిలో మెదులుతూ ఉండగా ఆ పక్షి నేలకు బలగా తాకింది,ఆపక్షి నెమ్మదిగా కళ్ళు మూసింది.కొంత సేపటికి   కళ్ళుతెరిచి  మైకం నుండి తెరుకోని గాలిలోకి ఎగరడానికి ప్రయత్నిచింది,ఏంటో తెలియదు తన శరీరంలో ఏదో తెలియని వెలితి,ఏదో పొగొట్టుకున్న అనుబవం. ఆ పక్షి తన రెండు రెక్కల వైపు  చూసుకుంది,ఒక రెక్క మాత్రమే కనిపించింది,అదికూడా అంతక ముందు గాయం ఐన రెక్క,రెండో వైపు రెక్క కనిపించడం లేదు,దిక్కు తోచక చుట్టుపక్కల చూసింది దూరంగా తన రెక్క రక్తమోడుతూ విలవిలలాడుతూ కనిపించింది,పక్కనే రక్తంతో తడిసి ముద్దైన రాయి కనిపించింది.అపుడు అర్ధమైంది ఆ పక్షికి ఆ రాయి ప్రేమ అనే మరొక అమాయక జీవి విసరడం తో తగిలింది అని.ఏమి చెయ్యలేని పరిస్థితిలో ఆ పక్షి ప్రాణంలేని జీవిలా మళ్ళి మైకం జారకుంది.

    మైకం లోకి జారుకున్న ఆ పక్షికి ఒక అందమైన కల వచ్చింది.ఆ కలలో  " చల్లటి గాలి కి  హయీగా నిద్రపోతున్న పోతున్న గాయపడిన పక్షి కి ఒక మెరుపుతో మెలుకువ వచ్చింది,నెమ్మదిగా కళ్ళు తెరుస్తుండగా ఒక వెలుగు నుండి ఎవరో ఎగురుతూ తన వైపు వస్తునట్టు అనిపించి అతి కష్టం మిద లేచి నిల్చుంది  అల ఎగురుతూ వచ్చింది ఎవరోకాదు తను ప్రేమించిన  పక్షి,అల ఆ పక్షి ఎగురుతూ వచ్చి గయాపడిన పక్షిముందు వాలింది,గాయపడిన పక్షి తన రెక్కలు లేవు అన్న విషయం మర్చిపోయి తన  రెక్కలతో ప్రేమించిన పక్షిని తాకాలి అని ప్రయత్నిచింది కానీ తన వల్ల కాలేదు.రెండో పక్షి నవ్వుతూ తన రెక్కలతో గాయపడిన రెక్కను పట్టుకొని ఆకాశంలోకి ఎగిరింది అల ఎగుతూ గాయపడిన పక్షిని చూసింది,గాయపడిన పక్షిలో ఏదో తెలియని ఆనందం,ఏదో గెలిచాను అనే సంతోషం తో  ఆ విశాల ఆకాశంలో ఆ రెండు పక్షులు కనుమరుగు ఐపోయాయి. " ఆ పక్షి అల మైకంలోనే నవ్వుతూ ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ప్రాణం విడిచింది.

            "ప్రాణం పోయే ముందు చివరి క్షణం లో  కూడా ప్రేమించిన వ్యక్తిని తలుచుకోవడమే నిజమైన ప్రేమంటే....."
           

   
       

కామెంట్‌లు లేవు: