Telugu Prema Kathalu

పేజీలు

30, అక్టోబర్ 2014, గురువారం

Jannat Part-3

"మూగాబోయిన నా కాలం కు కదలిక తెచ్చింది తన అందం
మరుగున పడిన నా లోని బావలను తట్టిలేపింది ఆ సోయగం
నిద్దుర పోతున్న నా ఆశలకు ఊపిరి ఊదిoది ఆ నయనం
   చలనం లేని ఈ ప్రాణానికి తిరిగి జీవం పోసింది తన స్నేహం

ఏనాటికైనా తనని చేజరానివ్వకంటుంది నా హృదయం"

      కాలేజీలో రెండోవ రోజు,ఉదయాన్నే రామ్ ఫోన్ చేసాడు.ఇద్దరం కలిసి కాలేజీ కి వెళ్ళాము,కాలేజీలోకి ఆడుగు పెడుతూనే తన గురించి చూడటం మొదలు పెట్టాను,రామ్ నన్ను చూసి అడిగాడు తన కోసం వెతుకుతున్నవా అని,నేను రామ్ వైపు చూసి చిన్నగా నవ్వాను,కానీ వాడు పెద్దగా నవ్వాడు.కొంచం సెపు కాలేజీలో తిరిగాం,తరువాత సెమినార్ హాల్ లో orientation class ఉంది అంటే వెళ్ళాము,వెళ్ళగానే ప్రిన్సిపల్ సర్ మాట్లాడుతున్నారు,ఈరోజు కుడా ఏదేన అనుకుంటూ లోపకి వెళ్ళాము.ఇద్దరం హాల్ లోపలోకి వెళ్లి ఒకే చోట కూర్చున్నాము,నాకళ్ళు నాకు తెలియకుండానే తనను వెతుకుతున్నయి,కానీ రామ్ మాత్రం సర్ చెప్పెది చాలా శ్రద్ధగా వింటున్నాడు,కానీ నాకు ఏమి వినిపించడం లేదు,ఎక్కడ ఎక్కడ,నా కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి. కొంచంసేపటి తరువాత ప్రిన్సిపల్ సర్ ఒక్కొక బ్రాంచ్ వాళ్ళని బయటకు వెల్లమంట్టున్నాడు,ఇప్పటి వరకు తను కనిపించ లేదు,ఇప్పుడు రామ్ కుడా కనిపించడు.ఎందుకంటే రామ్ వేరే బ్రాంచ్,నేను వేరే బ్రాంచ్ ఫస్ట్ నేను బయటకు వెళ్ళాను.

        ఒక సర్ మా బ్రాంచ్ వాళ్ళందరిని తీసుకొని కాలేజీ మొత్తం తిప్పి చూపిస్తున్నారు.నేను సర్ చెప్పెది వింటూనే తనకోసం వెతుకుతున్నాను.కొంచం సేపటి తరువాత సర్ లంచ్ కి వెళ్లి గంట లో తిరిగి రావాలి అని చెప్పారు. లంచ్ కోసం కాంటీన్ కి వెళ్ళాలి,నేను రామ్ కోసం వెతికాను కానీ నాకు వాడు కనిపించలేదు,కాంటీన్ దెగ్గర  ఉన్నాడేమో అని అక్కడికి వెళ్ళాను,కాంటీన్కి వెళ్తుంటే నన్ను ఎవరో దాటేసి వెళ్తున్నారు అనిపించింది.ఒక అమ్మాయి తన ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ నన్ను దాటేసి వెళ్తుంది.ఆ అమ్మాయి వైట్ చుడిదార్  లో దేవతలలా,కడిగిన ముత్యంలా నడుచుకుంటూ వెళ్తుంది,తను ఎవరో చుద్దామని తన వెనుక వెళ్తుంటే న బుజం మీద ఎవరో చైవేసినట్టు అనిపించింది నేను ఎవరా అని వెన్నక్కి తిరిగి చూసాను,నా మీద చైవేసింది రామ్.ఇద్దరం కలిసి లంచ్ చేసాము లంచ్ అయిన తరువాత కాంటీన్ నుంచి బయటకు వస్తుంటే నాకు ఎదురుగా తను వచ్చింది.నేను షాక్ అయ్యాను,ఎందుకంటే అంతకముందు నన్ను దటవేసిన వైట్ చుడిదార్ అమ్మాయి తనే.ఆ రోజు మొత్తం తనకు కనిపించకుండా తన వేనికే తిరిగాను,తన పేరు,బ్రాంచ్ తెలుసుకుందాం అని ఎంత ట్రై చేసిన తెలియలేదు.  (ఇంకా ఉంది).

29, అక్టోబర్ 2014, బుధవారం

Jannat Part-2

రామ్  నాతో  ఆ మాట చెప్పగానే నేను పెద్దగా నవ్వాను.అది ఏంటి అంటే ఆ అమ్మాయి మా సీనియర్.రామ్ కుడా నవ్వాడు.నేను మళ్ళి తన ధ్యాసలో పడిపోయాను.తను మాట్లడుతూ ఉంటె పియానో మీద మంచి మెలోడీ సాంగ్ ప్లే చేసినట్టు ఉంది.అలా తను మాట్లాడుతున్నంత  సెపు తని చూస్తూ ఉండిపోయాను,అప్పుడు చుట్టూ ఉన్న నా ప్రపంచం నరకం లా ఉంటె,తను మాత్రం ఆ నరకం మధ్యలో జన్నత్(Jannat) లాగా కనిపించింది.అప్పుడు ఆక్షణం తనని చూస్తూ ఉంటె నాకు తెలియకుండానే పెదవులపై చిరు నవ్వు వచ్చింది,గుండెలో హాయిగా అనిపించింది.ఆప్పుడు నా మనసు చెప్పింది ఏది ఏమైనా  సరే తనని దురం చేసుకోకు అని.అప్పుడే నా మనసులో ఒక కవిత్వం ఉపోగింది.
"తను నా చేతి లో  చై వేసి నడవనక్కరలేదు
నా కళ్ళతో ఊసులాడనవసరం లేదు
తన మాటల చినుకుతో నా తనవు తడవనవసరం లేదు
చిన్ని చిరునవ్వుతో నా యధపై ఒక్క క్షణం పవళిస్తే చాలు

ఆ క్షణాన నా ఊపిరి ఆగిపోయినా పర్వాలేదు!!!" 

తను మాట్లడటం ఐపోయింది,తను వెళ్ళిపోతుంది,అక్కడ నుంచి బయటకు వెళ్లిపోయింది.అపుడు తేరుకున్నాను వెంటనే నేను కుడా బయటికి వచ్చాను.తను బయట తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది.చాలా సెపు తననే చూస్తూ,తను ఎటు వెళితే అటు తన వెంట తిరిగాను.ఆ తరువత రామ్ వచ్చి నన్ను లాక్కొని పోయాడు.ఏంచేస్తున్నావురా అని అడిగాడు తను నాకు బాగా నచ్చిందిరా అన్నాను,తను మన సీనియర్ రా అన్నాడు నవ్వుతు,అయినా ఏం కాదు ,తను నా కంటే పెద్దదైన సరే "I LOVE HER"   అని మనసులో అనుకున్నాను'.తన పేరు తెలియదు,తన బ్రాంచ్ తెలియదు కానీ తను నచ్చిoది అన్న ఒక్క విషయం రామ్ కి బాగా నచ్చిందిరామ్ నా ఫోన్ నెంబర్ తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోయాడు.నేను మాత్రం  అక్కడే చాల సెపు తను కనిపిస్తుందని తిరిగాను,తను కనిపించింది,మళ్ళి ఆనందం ఇంతలో నాన్న కాల్ చేసి తొందరగా ఇంటికి వెళ్ళు అన్నారు,చేసేది లేక నేను కుడా వీల్లిపోయాను,కానీ న మనసు మాత్రం తన చుట్టు తిరుగుతునే ఉంది.... (ఇంకా ఉంది).

28, అక్టోబర్ 2014, మంగళవారం

Jannat Part-1

Jannat(స్వర్గం)
-----------------------------------------------------------------------------------------------------------------
              నా పేరు కార్తీక్(పేరు మార్చ బడినది).నేను జీవితంలో  మర్చిపోలేని రోజు ఏదైనా ఉంది అంటే అది 
21 సెప్టెంబర్ 2012.ఆ రోజు ఫస్ట్ టైం కాలేజీకి  చాలా హ్యాపీ గా వెళ్ళాను,కాలేజీ లోపలికి వెళ్ళగానే సెమినార్ హాల్ లోపలి వెళ్ళమన్నారు,సెమినార్ హలో orientation class conduct చేస్తున్నారు అని చెప్పారు. సెమినార్  హాల్  2nd floor లో ఉంది,చచ్చానురా దేవుడా అనుకున్న,కష్టపడి సెమినార్ హాల్  లోపలి వెళ్ళాను.హాల్ లోపలికి వెళ్ళగానే షాక్ అయ్యాను,అందరు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తో వచ్చారు,నేను బిక్కా మోకం వేసుకొని కల్లిగా ఉన్న చైర్ లో వెళ్లి కూర్చున్నాను,స్టేజి మీద ఉన్నవాళ్లు హడావుడిగా తిరుగుతూ ఉన్నారు.ఒకసారి చుట్టూ తిరిగి చూసాను అందరు చాలా హ్యాపీ గా ఉన్నారు,పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు,నాన్నకు డ్యూటీ ఉండటం వల్ల నాన్న రాలేకపోయారు,నేను ఒంటరిగా ఫీల్ అయ్యాను.ఇంతలో నాపక్కన ఎవరో వచ్చి ఎవరో కూర్చున్నారు,నాకు అప్పుడు తెలియదు నా పక్కన కుర్చున వ్యక్తి మంచి ఫ్రెండ్ కాబోతున్నాడు అని. 5 ని" తరువాత టైం ఎంత అని అడిగాడు,నేను 9:50 అని చెప్పాను.తరువాత పరిచయం చేసుకున్నాం,తన పేరు రామ్(పేరు మార్చ బడినది) అని  చెప్పాడు,వాడు ఓపికగా ప్రశ్నలు అడుగుతున్నాడు నేను ఓపికగా సమాధానాలు చెప్తూనే ఉన్నాను.

           ప్రోగ్రాం స్టార్ట్ చేసారు,ఒకరి తరువాత ఒకరు speech లు ఇస్తునే ఉన్నారు.నాకు చాలా బోర్ అనిపించింది,నా చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం  హరి కధ విన్నట్టు వింటున్నారు.మా ఓపిక నశించకుండా ఉండటానికి Maaza  ఇచ్చారు.చాలా మంది speech లు ఇవ్వడం వల్లా బుర్రా హీట్ ఎక్కింది.పెద్ద వాళ్ళు speech ఇచ్చిన తరువాత స్టూడెంట్స్ వల్లా అనుబవాలు స్టేజి పైకి ఎక్కి చెప్తున్నారు.fresher అనుకుంట ఒక అమ్మాయి స్టేజి పైకి ఎక్కి మాట్లడుతు ఉంది,రామ్ ఆ అమ్మాయి వైపు ఆలా చస్తూనే ఉన్నాడు........,ఇంతలో నాకు ఫోన్ కాల్ వచ్చింది,నేను ఫోన్ లో మాట్లడుతున్నపుడు ఒక అమ్మాయి ని పిలిచారు, నేను విసుగ్గా స్టేజి వైపు ఇంకా ఎంత సేపు ఉంది అన్నట్టు చూసాను,ఒక్క సారి కాలం ఆగిపోఇనట్టు అనిపించింది.ఒక దేవత లా స్టేజి మేధా మాట్లడుతూ ఉంది.ఆ క్షణం నా గుండె చప్పుడు నాకు స్పష్టంగా వినిపించింది.తను ఏం మాట్లాడిందో తెలియదు,కానీ తను గొంతు చాలా బాగుంది.నేను తన వైపు చూస్తూ ఉంటె రామ్ తన గురించి నాతో ఒకటి చెప్పాడు......(ఇంకా ఉంది)